బీజింగ్: ఈ నెల 3 నుంచి 5 వరకూ జరగ నున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లు భేటీ అయ్యే వీలుంది. చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చున్యింగ్ గురువారం మీడియాకు తెలిపారు. ‘భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సమావే శాలకు సమయం వస్తే అందుకు చైనా తప్పనిసరిగా ఏర్పాట్లు చేస్తుంద’న్నారు.
బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై పాకిస్తాన్ సాగిస్తున్న పోరు అంశాన్ని చర్చించేందుకు చైనా విముఖంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై పాక్ పోరు తమకు ప్రాధాన్య అంశం కాదంది.‘ ఉగ్రవాదంపై పోరులో పాక్ ముందంజలో ఉంది. ఉగ్రవాదంపై పాక్ పోరును అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. ఈ అంశంలో పాక్‌సహా ఇతర దేశాలతో కలసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని హు అన్నారు.