కుక్కల పుట్టినిల్లు చైనా
బీజింగ్: చైనాలోని దక్షిణ ప్రాంతంలో 33 వేల సంవత్సరాల కిందటే కుక్క లు పుట్టాయని చైనీస్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మధ్య ఆసియాలో 15 వేల ఏళ్ల క్రితమే కుక్కలు పుట్టాయని యూఎస్ సైంటిస్ట్‌లు చెప్పిన విషయాన్ని చైనీస్ శాస్త్రవేత్తలు ఖండించారు. 38 దేశాల్లోని 4,600 జాతులకు చెందిన 1,85,800 కుక్కలను విశ్లేషించి కుక్కలు మొదట పుట్టింది మధ్య ఆసియాలోనేనని అమెరికాలోని కార్నల్ వర్సిటీ చెప్పింది.
కానీ ఆ వర్సిటీ చైనాకుక్కలపై పరిశోధించలేదని, మధ్య ఆసియాకు వారిచ్చిన నిర్వచనంకూడా సరిగా లేదని జూవాలజీ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ వాంగ్ గుయోడాంగ్ అభిప్రాయపడ్డారు. కార్నల్ వర్సిటీ పరిశోధన ఫలితాల ను చైనాలోని కుక్కలతో పోల్చి చూసినప్పుడు చైనా శునకాలు చాలా పురాతనమైనవిగా తేలిందని వాంగ్ తెలిపారు.