చైనా, కెనడా భాయి.. భాయి
చైనా, కెనడా భాయి.. భాయి
Published Sat, Sep 24 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
మాంట్రియల్: చైనా, కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడేవ్ బీజింగ్లో పర్యటించిన నెల రోజుల అనంతరం చైనా ప్రధాని లీ కెకియాంగ్ కెనడాలో మూడురోజుల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య విన్-విన్ సహకారం కొనసాగుతుందని లీ కెకియాంగ్ ప్రకటించారు. శుక్రవారం మాంట్రియల్లో జరిగిన కెనడియన్-చైనీస్ బిజినెస్ కౌన్సిల్లో పాల్గొన్న లీ.. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి రాజీ లేదని వెల్లడించారు.
అమెరికా తరువాత కెనడాకు రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనానే. 2025 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లీ వెల్లడించారు. గత కెనడా ప్రభుత్వ హయాంలో ఇరుదేశాల మధ్య అంత ప్రభావవంతంగా లేనటువంటి సంబంధాలు ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నాయని.. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాల్లో గోల్డెన్ డికేడ్ ప్రారంభం అని లీ కెకియాంగ్ ప్రకటించారు. అలాగే.. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి స్వేచ్చా వాణిజ్యం దిశగా చర్చలు ముందుకు వెళ్తున్నాయని ఆయన వెల్లడించారు. గత ఏడాది చైనా, కెనడాల మధ్య 64.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.
Advertisement
Advertisement