బీజింగ్: కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్ నగరంలో మరో వైద్యుడు చనిపోయారు. వుహాన్ సెంట్రల్ హాస్పిటల్‌లో ఆప్తమాలజీ శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా చేస్తున్న మియా జాంగ్‌మింగ్ కరోనా సోకి గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 57 ఏళ్లు కాగా.. గతంలో కరోనా వైరస్ బారినపడి మరణించిన డాక్టర్ లీ వెన్‌లియాంగ్‌కు జాంగ్‌మింగ్ స్నేహితుడు కావడం గమనార్హం. చదవండి: ఆసుపత్రి డైరెక్టర్ ప్రాణం తీసిన కోవిడ్-19
అయితే వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో కరోనాతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన మూడవ డాక్టర్‌గా మియా నిలిచారు. కరోనా నియంత్రణ కోసం వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ.. ప్రత్యేక మాస్క్‌ల ద్వారా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. మరో వైపు బీజింగ్‌లో కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్ దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల పాటు క్వరెంటైన్‌కు పంపనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కాగా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి సోకగా 3000 మందికి పైగా మరణించారు. ఈ వైరస్ పుట్టుకొచ్చిన చైనాలోనే అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి. చదవండి: కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్
Comments
Please login to add a commentAdd a comment