పొడిచేస్తున్నాడని.. కాల్చేశారు | China police shoot man dead after 9 hurt in knife attack | Sakshi
Sakshi News home page

పొడిచేస్తున్నాడని.. కాల్చేశారు

Published Fri, Mar 6 2015 10:53 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

China police shoot man dead after 9 hurt in knife attack

రైల్వే స్టేషన్లో ప్రయాణీకులపై విచక్షణ రహితంగా ఓ వ్యక్తి కత్తితో దాడులు చేస్తుండటంతో అతడిని అదుపుచేసేందుకు పోలీసులు తుపాకీతో కాల్చిపడేశారు. ఈ సంఘటన చైనాలోని గాంగ్జో రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. అంతకుముందు ఆ వ్యక్తి చేసిన దాడిలో తొమ్మిదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. గత ఏడాది నుంచి రైల్వే స్టేషన్లలో ఇలా కొందరు దుండగులు కత్తులతో తెగబడుతున్న మూలంగా ఇప్పటివరకు 31 మంది ప్రయాణీకులు చనిపోయారు.  దీంతో రైల్వే స్టేషన్లకు వెళ్లాలంటేనే ప్రయాణీకులు భయపడుతున్నారట. ఇలాంటి దారుణాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుపై కూడా ఆ దుండగులు భయపడకుండా కత్తులతో దాడులు చేస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement