లీ ముంగ్ బక్, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు
సియోల్ : అవినీతి ఆరోపణల కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు లీ ముంగ్-బక్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ దక్షిణ కొరియా కోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. ఆయనపై చాలా అవినీతి ఆరోపణల కేసులు వచ్చాయని, అవన్నీ చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయంటూ కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. లీ ముంగ్ 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, ఆయనపై పలు అవినీతి కేసులు వచ్చాయి. దీంతో విచారణకు పిలిచిన సందర్భంలో ఆయన తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. దీంతో దర్యాప్తును సీరియస్‌గా చేసిన పోలీసులు కేసు విచారిస్తున్న సెంట్రల్ డిస్ట్రిక్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు.
ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. తాను అమాయకుడినని చెప్పుకుంటూనే సాక్ష్యాలు మాయం చేసే చర్యలకు లీముంగ్ దిగారని, సాక్షులను బెదిరించారని కూడా కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా, తన అరెస్టుకై ఆదేశాలు వచ్చిన వెంటనే లీముంగ్ సోషల్ మీడియాలో స్పందించారు. తాను అధ్యక్షుడిగా పనిచేసినంతకాలం ప్రజలకు మంచి సేవలు అందించేందుకే కృషిచేశానని అన్నారు. ఏ క్షణంలో అయినా ఆయనను పోలీసులు అరెస్టు చేయవచ్చు. మోసం, అవినీతి, పన్ను ఎగవేత, బోగస్ చెల్లింపులువంటి ఆరోపణలు లీముంగ్‌పై నమోదు అయ్యాయి. సోమవారం ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment