ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు... | A drawing of DNA | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏ గీసిన బొమ్మ

Published Thu, Dec 19 2019 2:39 AM | Last Updated on Thu, Dec 19 2019 6:50 PM

A drawing of DNA - Sakshi

ఫొటో చూశారుగా.. అమ్మాయి భలే ముద్దుగా ఉంది కదూ. టామ్‌ జోక్‌లాండ్‌ అనే చిత్రకారుడు గీశాడు దీన్ని. అయితే ఏంటి అంటున్నారా? చాలా విశేషాలే ఉన్నాయి ఈ చిత్రం వెనుక. ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు. సుమారు 5,700 ఏళ్ల క్రితం నివసించి ఉండొచ్చని అంచనా. డెన్మార్క్‌లోని సైల్‌థోలమ్‌ అనే ప్రాంతంలో తవ్వకాల్లో లభించిన ఓ బబుల్‌గమ్‌ (ఓ చెట్టు బెరడు. బబుల్‌గమ్‌లా నమిలేవారట) అవశేషం నుంచి ఈ అమ్మాయి చిత్రాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు.

అదెలా అంటే ఈ బబుల్‌గమ్‌ అవశేషంలో అమ్మాయి తాలూకు డీఎన్‌ఏ లభించింది. దీని ఆధారంగా మొత్తం జన్యుక్రమాన్ని పునర్నిర్మించారు. అంతేకాకుండా నమిలిన కారణంగా ఆ అవశేషానికి నోటిలోని బ్యాక్టీరియా, ఆ చెట్టులో ఉండే సూక్ష్మజీవుల ఆనవాళ్లూ కనిపించాయి. వీటన్నింటి ఆధారంగా ఆ డీఎన్‌ఏ కలిగిన వ్యక్తి మహిళ అని గుర్తించారు. అంతేకాకుండా ఒడ్డూ పొడవు, కనులు, చర్మం రంగు వంటి వాటిని నిర్ధారించారు. ఆ విశేషాలను ఆధారంగా చేసుకుని టామ్‌ జోక్‌లాండ్‌ ఈ చిత్రాన్ని గీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement