
అసాంజేకు నెట్ ను కట్ చేసింది మేమే : ఈక్వెడార్
క్విటో: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఇంటర్‌నెట్ సదుపాయాన్ని నిలిపేసినట్లు ఈక్వెడార్ తెలిపింది. అమెరికా ఎన్నికల్లో అంతరాయాలు సృష్టించకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని పాటిస్తామంది. విదేశీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం గాని, ప్రత్యేకించి ఓ అభ్యర్థివైపు మొగ్గు చూపడం గాని తమ అభిమతానికి విరుద్ధమని ఈక్వెడార్ విదేశాంగ మంత్రి తెలిపారు. అసాంజే విడుదల చేసిన పలు పత్రాలు అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని అందుకే అసాంజేకు కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిపేశామన్నారు.