
అసాంజేకు తప్పిన గండం
వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు గండం తప్పింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఈక్వెడార్‌లోనే కొనసాగేందుకు మరోసారి సిద్ధమయ్యారు.
దీంతో అసాంజేలో కొంత ఆందోళన నెలకొంది. స్వీడన్‌లో లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లండన్ రాయబార కార్యాలయం అయిన ఈక్వెడార్‌లో ఉంటున్నారు. ఆయనకు లెప్టిస్ట్ పార్టీ ఆశ్రయం కల్పించింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి లెఫ్టిస్ట్ పార్టీనే అధికారానికి చేరువవుతున్న నేపథ్యంలో ఆయన ఈక్వెడార్‌లోనే ఇక ఉండిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రతినిధి లెనిన్ మోరెనో మాట్లాడుతూ తాము అసాంజేకు ఆశ్రయం ఇస్తామని హామీ ఇచ్చారు.