టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ (48)మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ మేకర్ చైనాలో ఈ సారి స్టెప్పులతో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్లో చక్కర్లు కొడుతోంది. చైనాలోని షాంఘైలోని తన కంపెనీ ప్లాంట్‌లో పెద్ద సంఖ్యలో మోడల్ 3 కార్లను వినియోగదారులకు అందిస్తూ మంగళవారం ఉత్సాహంగా డాన్స్ చేశారు. గ్లోబల్ మార్కెట్ కోసం చైనాలో భవిష్యత్ టెస్లా కారును డిజైన్ చేస్తామని ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ చెప్పారు
చైనా తయారు చేసిన టెస్లా వాహనాల మొదటి డెలివరీ సందర్బంగా టెస్లా గిగా ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో చేసిన ఆయన విన్యాసాలను స్వయంగా ట్విటర్లో ఆయన షేర్ చేశారు. అరగంట వ్యవధిలో ఈ వీడియో 30 వేల 'లైక్' లు సాధించింది. వినోదభరితమైన ఆసర్తికరమైన వ్యాఖ్యలతో రీట్వీట్లు, 110.8వేలకుపైగా లైక్స్‌తో హల్ చల్ చేస్తోంది. "మార్కెటింగ్ మేధావి". "హ్యాపీ డాన్స్ !!! అన్న కమెంట్లు వెల్లువెత్తాయి.
U.S. electric carmaker Tesla started delivering made-in-China vehicles to customers on a large scale on Tuesday at its Shanghai plant, just a year after the gigafactory broke ground @elonmusk pic.twitter.com/2rkdRYFtXJ
— China Xinhua News (@XHNews) January 7, 2020
Comments
Please login to add a commentAdd a comment