
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడిపై మరో అవినీతి కేసు
బ్రెజిల్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా ద సిల్వా మరో పదిమందిపై తాజాగా అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. లులాతోపాటు ప్రముఖ వ్యాపార వేత్త మార్సిలో ఓదెబ్రెక్ లపై ఫెడరల్ ప్రాసీక్యూటర్స్ సోమవారం వీరిపై ఆరోపణలు నమోదుచేసినట్లు అక్కడి మీడియా తెలిపింది.
'అవినీతి, మనీలాండరింగ్, ప్రలోభాలకు గురిచేయడంవంటి చర్యలకు వీరు పాల్పడినట్లు ఆరోపణల్లో పేర్కొన్నారు. అంగోలన్ ప్రభుత్వంతో ఒప్పందాల మార్పిడిలో భాగంగా బ్రెజీలియన్ డెవలప్ఎంట్ బ్యాంక్ ను ఉపయోగించుకొని పెద్ద మొత్తంలో నిధులు కాజేశారని అధికారులు వెల్లడించారు.