ఫేస్బుక్లో నకిలీ ఖాతాల బెడద
హైదరాబాద్: అత్యంత ప్రాచుర్యం పొందిన సోషియల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో నకిలీ ఖాతాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షలకుపైగా నకిలీ అకౌంట్లు ఉన్నట్టు నిర్వాహకులు అంచనా వేవారు. భారత్తో పాటు టర్కీలో నకిలీ అకౌంట్ల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఫేస్బుక్ ఖాతాదారులు తమ ఒరిజినల్ అకౌంట్తో పాటు అదనంగా నకిలీ అకౌంట్ కలిగిఉన్నారని వివరించారు.
గత మార్చితో పోలిస్తే ఏప్రిల్ నాటికి ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య 15 శాతం పెరిగినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రతినెలా ఫేస్బుక్ను వినియోగించే వారి సంఖ్య 128 కోట్ల మంది ఉన్నట్టు చెప్పారు. ఖాతా దారుల సంఖ్య పెరగడానికి భారత్, బ్రెజిల్లో ఫేస్బుక్ను అమితంగా ఆదరించడమే కారణమని తెలిపారు.