న్యూయార్క్: ఫేస్బుక్.. వ్యక్తుల మధ్య భావాల్ని పంచుకునేందుకు చక్కటి వేదిక. భావాల్ని పంచుకోవడం మాట అటు ఉంచితే.. నకిలీ అకౌంట్ల బెడద మాత్రం ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ కు తప్పడం లేదు. ఏకంగా ఇండియా, టర్కీ దేశాల్లో 14.3 కోట్ల మంది నకిలీ అకౌంట్లు కల్గి ఉన్నారని తాజాగా తేలింది. దీనిపై యూఎస్ సెక్యురిటీ ఎక్సెంజ్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా 119 కోట్ల మంది ఫేస్బుక్ అకౌంట్ల కలిగి ఉన్నా, వీటిలో నకిలీ ఖాతాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం 7.9 శాతం మంది నకిలీ ఖాతాలతో ఉండగా, 2.1 శాతం మంది దుర్వినియోగ పరుస్తున్నట్టు తేలింది. వీటిలో 1.2 శాతం వరకూ తొలగించినట్లు ఎక్సైజ్ కమీషన్ తెలిపింది. అధునాతన మార్కెట్ రంగంలో ముందు వరుసలో ఉన్న అమెరికా, యూకే ల్లో కంటే భారత్, టర్కీల్లో నకిలీ ఖాతాలు పెరగడం ఆందోళనకరంగా మారింది.