లండన్: ఫేస్ బుక్ లో ఫోటో పోస్టు చేసి తప్పుడు టాగ్ లైన్ రాసినందుకు రెండేళ్లు జైలు శిక్ష పడిన ఘటన నార్తర్న్ ఐర్లాండ్ లో చోటుచేసుకుంది. గతేడాది జులైలో నేషనలిస్ట్, యూనియనిస్టులకు మధ్య జరిగిన అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై అందోళనకారులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. ఇందులో 29 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఒక పోలీసు అధికారి తన చెవిని కోల్పోయాడు.
ఈ అల్లర్లకు సంబంధించి సోషల్ సైట్లలో వివరాల కోసం గాలస్తున్న పోలీసులకు 'నేను అల్లర్లలో పాల్గొన్నాను' అని రాటర్ట్ దరాగ్ (21) పోస్టు చేశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాబర్ట్ అల్లర్లలో్ పాల్గొన్నట్టు ఎటువంటి ఆధారం అక్కడున్న సీసీటీవీ పుటేజీలో లభించలేదు. ఆసమయంలో తాను మద్యం సేవించిన మత్తులో తప్పుగా రాశానని రాబర్ట్ చెప్పాడు. తప్పుడు రాతలతో ఫేస్ బుక్ పోస్టు చేసింనందుకు బెల్ ఫాస్ట్ క్రౌన్ కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.