ట్రంప్‌ షాకింగ్‌ నిర్ణయం వాయిదా | The Fake News Awards on Jan 17 : trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ షాకింగ్‌ నిర్ణయం వాయిదా

Jan 8 2018 11:54 AM | Updated on Oct 9 2018 6:34 PM

The Fake News Awards on Jan 17 : trump - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఓ షాకింగ్‌ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెనక్కి తీసుకున్నారు. చెత్త మీడియా అవార్డులను సోమవారం సాయంత్రం ప్రకటిస్తానని చెప్పిన ఆయన దానిని ఈనెల (జనవరి) 17కు వాయిదా వేశారు. నీతి, నిజాయితీ లేకుండా, చెత్త రిపోర్టింగ్‌ చేస్తున్న మీడియా సంస్థలకు తాను ఫేక్‌ న్యూస్‌ అవార్డులు ఇస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయంపై పలు మీడియా సంస్థలకు తీవ్ర ఆగ్రహం వచ్చినప్పటికీ అవి ఏ మీడియా సంస్థలు అయి ఉంటాయా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. అందరూ ఊహించినదానికంటే ఎక్కువ ఆసక్తితో, ప్రాధాన్యతతో ఈ అవార్డులు ఇస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సమయంలో ట్రంప్‌ తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాపై బాహాటంగానే విమర్శలు కురిపించడంతోపాటు, పంచ్‌ లు విసిరారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నవంబరులోనే ట్రంప్‌ ‘ఫేక్‌న్యూస్‌ ట్రోఫీ’ కోసం పోటీ ప్రారంభిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే.
 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement