కంచె నిలబడటంలేదు
బతుకు పోరాటంలో నిలువెత్తు ఇనుప కంచెలు నిలబడటంలేదు. 2011లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం 2015నాటికి తీవ్రరూపం దాల్చింది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాదులకు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య జరుగుతున్న పోరులో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దు దేశమైన టర్కీకి వలస వెళుతున్నారు.
ప్రారంభంలో స్వేచ్ఛగా వలసదారులను దేశంలోకి రానిచ్చిన టర్కీ ఆ తర్వాత సరిహద్దును మూసివేసింది. అయినా ప్రజలు సరిహద్దు కంచెను బద్దలుకొట్టుకుని టర్కీతోపాటు ఇతర దేశాలకు నిత్యం వెళుతూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నివేదిక ప్రకారం వలస వెళ్లే వారిలో 70 శాతం పిల్లలు, మహిళలే ఉన్నారు.