ఇస్లామాబాద్: ముంబై నగరంపై 2008 నవంబరు 26న జరిగిన దాడులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేసేందుకు తమకు మరిన్ని ఆధారాలు అందివ్వాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాక్ విదేశాంగ కార్యదర్శి, భారత విదేశాంగ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. ఈ కేసులో లష్కరే తోయిబా కమాండర్ జకీ-ఉర్ రెహ్మాన్ లఖ్వీతోపాటు మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు.
భారత్ ఈ లేఖకు ఇంకా స్పందించలేదు. ఈ కేసులో అరెస్టయి, ఏడాది క్రితం విడుదలైన లఖ్వీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఆరేళ్లుగా సాగుతున్నఈ కేసు విచారణను తొంద రగా ముగించాలని కోరుతున్న భారత్.. అన్ని ఆధారాలను ఇప్పటికే అందించింది.
26/11పై మరిన్ని ఆధారాలు ఇవ్వండి: పాక్
Published Fri, Jul 1 2016 2:56 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM
Advertisement
Advertisement