
అమ్మకానికి ‘ప్రేమ దీవి’
హృదయాకారంలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ దీవి కెనడాలోని లారెంటియన్ ప్రాంతంలో ఉంది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ‘ప్రేమ దీవి’ని అమ్మకానికి పెట్టారు.
హృదయాకారంలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ దీవి కెనడాలోని లారెంటియన్ ప్రాంతంలో ఉంది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ‘ప్రేమ దీవి’ని అమ్మకానికి పెట్టారు. చుట్టూ చెట్లు, ముందు చక్కనైన బీచ్‌తో అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, ఈ క్రిస్మస్ సందర్భంగా తమకు నచ్చినవారికి ఇవ్వడానికి ఇంతకుమించిన బహుమతి ఏమీ ఉండదని దీనిని విక్రయానికి పెట్టిన సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఈ దీవిలో ఉన్న ఇంటికి విద్యుత్, టెలిఫోన్ లైన్లు, ఇంటర్నెట్ సహా అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? కేవలం 10 లక్షల డాలర్లు మాత్రమే. మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు ఆరు కోట్లు! మరి ఇష్టుల మనసు దోచుకోవాలంటే ఈ మాత్రం కాస్త ఖర్చుపెట్టక తప్పదు కదా..!