'శృంగారానికి నో అందని పొడిచిపొడిచి చంపా' | Hospital worker who stabbed Gumtree flatmate to death after she refused to have sex with him | Sakshi
Sakshi News home page

'శృంగారానికి నో అందని పొడిచిపొడిచి చంపా'

Published Mon, Apr 11 2016 5:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

'శృంగారానికి నో అందని పొడిచిపొడిచి చంపా'

'శృంగారానికి నో అందని పొడిచిపొడిచి చంపా'

లండన్: తనతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించిందనే కారణంతో తన ఫ్లాట్ మేట్, ప్రముఖ ఫ్యాషన్ బయర్ కాటి రూర్కే(27)ను పొడిచిపొడిచి చంపినట్లు గ్యారీ స్టీవెన్సన్(27) తెలిపాడు. లండన్ కు చెందిన గ్యారీ స్టీవెన్సన్ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అతడు కాటి రూర్కే అనే ఫ్యాషన్ బయర్ తో బాగా చనువుగా ఉండేవాడు. గ్లాస్గోలోని క్రెయిగ్టాన్లోగల మింటో వీధిలోని గమ్ ట్రీ అపార్ట్ మెంట్లో వారు ఉండేవారు. డిసెంబర్ 29 రాత్రి వారిద్దరి మధ్య తొలుత ఒక స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అతడు ఆమెను తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంత పెట్టాడు. కానీ, ఆమె నిరాకరించింది.

దీంతో అతడు కోపంతో ఆమెను కత్తితో పొడిచేసి అదే ఫ్లాట్ లో పడేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆ రోజు జరిగిన వివరాలు తెలియజేస్తూ 'నేను ఆరోజు ఆమెను పొడిచాను. మూడుసార్లు పొడిచానని అనుకుంటున్నాను. ఒక వేళ ఆమెను కాకుంటే మరొకరిని అయి ఉండేదేమో. ఆ సమయంలో నా పరిస్థితి అలా ఉంది. కుటుంబం కోసం ఆ రోజు ఓ నిజం చెప్పాలని అనుకున్నాను. కత్తితోపొడిచేందుకు ముందు బలంగా చాలాసార్లు కొట్టాను. మా మధ్య ఒప్పందం కుదరకపోయే సరికి నాపై నియంత్రణ కోల్పోయాను. అంతే ఆమెను కొట్టడం ప్రారంభించి ఇక ఆపలేకపోయాను. అలా కొడుతూ కొడుతూ కొడుతూనే ఉండి.. తర్వాత పొడిచేశాను' అని వివరణ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement