
మయన్మార్ అధ్యక్షుడిగా మాజీ కారు డ్రైవర్
నేపిదా: మయన్మార్ అధ్యక్షుడిగా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ మాజీ డ్రైవర్, ప్రధాన అనుచరుడు టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. మంగళవారం మయన్మార్ పార్లమెంట్ అధ్యక్షుడిగా టిన్ క్వాను ఎన్నుకుంది.
ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల సూచీ అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోవడంతో టిన్ క్వాను అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. టిన్, సూచీతో కలిసి చదువుకున్నారు. చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ భారీ విజయం సాధించింది.