వాషింగ్ టన్: 2015లో 6.3 శాతం అభివృద్ధితో, 2016లో 6.5 శాతం అభివృద్ధితో అభివృద్ధి సూచీలో భారత్
చైనాను అధిగమించబోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) తెలియజేసింది. ప్రస్తుత భారత ప్రభుత్వ ప్రణాళికలు అందుకు అద్దం పడుతున్నాయని, వాటిని చూస్తుంటే ఇది నిజమయ్యేలా ఉందని తెలిపింది.
అయితే ఆ ప్రణాళికలను భారత ప్రభుత్వం ఏ మేరకు అమలుచేస్తుందో వేచి చూడాల్సి ఉందని ఐఎమ్ఎఫ్ అనుమానం వ్యక్తం చేసింది. 2014 లో భారత అభివృద్ధి 5.8 శాతంగా నమోదైతే, అదే ఏడాది చైనా 7.4 శాతం అభివృద్ధిని నమోదు చేసిందని ఐఎమ్ఎఫ్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక నివేదికలో పేర్కొంది.