
ఆస్ట్రేలియాకు భారత్ మామిడిపండ్లు
మెల్‌బోర్న్: భారత్ తొలిసారిగా ఆస్ట్రేలియాకి మామిడి పండ్లను ఎగుమతి చేయనుంది. అన్నీ కుదిరితే మామిడి ఎగుమతులు ఈ ఏడాదే ప్రారంభం కావొచ్చు.
జీవభద్రత నియమ నిబంధనలకు లోబడి ఎగుమతులు జరిగితే ఈ ఏడాది మామిడి సీజన్ ముగిసేలోగా భారతదేశం మామిడి పండ్లు ఆస్ట్రేలియాకు చేరుతాయని ఆస్ట్రేలియా మామిడి పరిశ్రమ సంఘ ప్రతినిధి రాబర్ట్ గ్రే చెప్పారు.