
వినాయకుని ప్రకటనపై కేసు వేసిన భారత్
‘ది మీట్ వుయ్ కెన్ ఆల్ ఈట్’ పేరుతో ప్రకటన రూపొందించిన `మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఆస్ట్రేలియా` కంపెనీకి ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే ఆసీస్ నివాసం ఉంటున్న భారత కమ్యూనిటీ సంఘాలు కూడా ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. వీలైనంత త్వరగా ప్రకటన ప్రసారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనలో వినాయకుడితో పాటు జీసస్, బుద్ధుడు, ఇతర గ్రీకు దేవతలు కూడా ఉండటం విశేషం.