భారత సంతతికి చెందిన ఓ మావోయిస్టుపై యూకేలో అత్యాచారం కేసు నమోదైంది.
లండన్: భారత సంతతికి చెందిన ఓ మావోయిస్టుపై యూకేలో అత్యాచారం కేసు నమోదైంది. మావోయిస్టు నాయకుడిగా ఉన్న అరవిందన్ బాలకృష్ణన్(73) గత ముఫ్పై సంవత్సరాలుగా ముగ్గురు మహిళలను అతని ఇంట్లో నిర్భందించి అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో అతనిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. బాలకృష్ణన్ పై ఉన్న పాత కేసులను కలుపుకుని మొత్తం 25 అభియోగాలు నమోదు చేసిన పోలీసులు డిసెంబర్ 17 వ తేదీన కోర్టుకు హాజరపరచనున్నారు.
1983 నుంచి 2013 మధ్య కాలంలో బాలకృష్ణన్ ఆ మహిళలపై ఆకృత్యాలకు పాల్పడిన విషయం గతేడాది వెలుగులోకి వచ్చింది. దీనిపై సరైన ఆధారాలు లభించిన తర్వాతే అతనిపై అభియోగాలు నమోదు చేసినట్లు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) తెలిపింది. అతని భార్య చందా పట్టిన్ తో కలిసి బాలకృష్ణన్ ను 2013 లో నవంబర్ అదుపులోకి తీసుకున్నా.. ఈ కేసులో అతని భార్యకు ఎటువంటి సంబంధం లేదని రుజువుకావడంతో ఈ ఏడాది మొదట్లో ఆమెను విడుదల చేశారు.