అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య | Indian-Origin Man In US Stabbed To Death By Cousin | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

Published Thu, Jun 29 2017 12:08 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య - Sakshi

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

న్యూయార్క్‌: 26 ఏళ్ల భారత సంతతి వ్యక్తి అమెరికాలో తన సోదరుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.

డ్రైవర్‌గా పనిచేసిన శరణ్‌జిత్‌ సింగ్‌ 2013లో అమెరికాకు వెళ్లాడు. తన కజిన్‌ సోదరుడు లవ్‌దీప్‌ సింగ్‌(24)తో కలిసి క్వీన్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 26న సోదరుల మధ్య వివాదం తలెత్తడంతో లవ్‌దీప్‌ సింగ్‌.. శరణ్‌జీత్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సోదరుడిని హత్యచేసినట్లు లవ్‌జీత్‌ అంగీకరించాడని విచారణ అదికారులు వెల్లడించారు. అయితే.. ఈ హత్య వెనుకాల గల కారణాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. శరణ్‌జీత్‌ తల్లిదండ్రులు భారత్‌లోనే ఉన్నారు. లవ్‌జీత్‌కు 25 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement