
భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆలాప్ నరసిపురా(20) కార్నెల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరంగ్ చదువుతున్నాడు. అయితే ఈనెల 17తేదీ నుంచి నరసిపురా కనిపించకుండా పోయాడు. ఫాల్ క్రీక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించగా అది నరసిపురదిగా గుర్తించారు. అయితే నరసిపురా మృతిపై ఇప్పటివరకూ ఎలాంటి అనుమానాలు లేవని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దీనిపై విద్యార్థి వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ లంబద్రీ మాట్లాడుతూ నరసిపురా చురుకైన విద్యార్థి అని, తనతో రోజు ఫోటోలు దిగేవాళ్లం అని, బుధవారం ఉదయం కూడా నరసిపురాను చూసినట్లు తెలిపాడు. తాను ఇక్కడే మాస్టర్ డిగ్రీ చేయాలని ప్రణాళికలు వేసుకున్నాడని గుర్తుచేసుకున్నాడు.