టెహ్రాన్: కొన్ని రోజుల క్రితం ఇరాన్, ఎంటీ రియా అనే నావను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అందులో మొత్తం 12 మంది భారత సిబ్బంది ఉన్నారు. అయితే తాజాగా వారిలో తొమ్మిది మందిని ఇరాన్ విడుదల చేసింది. కాగా మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్ పలు నావలను నిబంధనల ఉల్లంఘనల పేరిట అదపులోకి తీసుకుంది. దాంతో ఆ నావల్లో ఉన్న భారతీయులు ఇరాన్ అదుపులోకి వెళ్లారు. ఇటీవల అదుపులోకి తీసుకున్న బ్రిటన్ నౌక స్టెనా ఇంపెరోలో ఉన్న 18 మంది, ఎంటీ రియాలో ఉన్న ముగ్గురితో కలిపి ప్రస్తుతం 21మంది భారతీయులు ఇరాన్ చెరలో ఉన్నారు.
అలాగే గ్రేస్1 నావలో ప్రయాణిస్తున్న 24 మంది భారత నావికులను జీబ్రాల్టర్ పోలీసు అథారిటీస్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. లండన్‌లోని భారత రాయబారులు వారిని బుధవారం కలిశారని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment