ఉత్తర కొరియాతో ఆటలు ప్రపంచానికి డేంజర్
న్యూయార్క్: ఉత్తర కొరియాను అమెరికా బెదిరించడం ప్రపంచానికే ప్రమాదకరమని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ అన్నారు. అమెరికా బెదిరిస్తుండటం వల్లే ఉత్తర కొరియా అణ్వాస్త్రాల పరీక్షలు నిర్వహిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది మొత్తం ప్రపంచానికే డేంజర్ అని చెప్పారు.
'తూర్పు ఆసియా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఉత్తర కొరియా ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకుంది? ఎందుకంటే ఆ దేశానికి బెదిరింపులు వెళుతున్నాయి కాబట్టి' అని రౌహానీ అన్నారు. బుధవారం ఆయన కేబినెట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అసలు అణ్వస్త్రాలతో ఎవరైనా హాస్యం చేయొచ్చా? అణ్వాస్త్రాలు కలిగి ఉన్న ఓ దేశాన్ని బెదిరించడం అంటే అది ఎంతో ప్రమాదకరమైన ఆట. ఇలాంటి ఆటలు ఆడితే ప్రపంచానికే ప్రమాదం ఏర్పడుతుంది' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.