ఐర్లండ్లో ఉగాది వేడుకలు | Ireland telugu samajam to celebrate ugadi | Sakshi
Sakshi News home page

ఐర్లండ్లో ఉగాది వేడుకలు

Published Thu, Mar 12 2015 8:25 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

ఐర్లండ్లో ఉగాది వేడుకలు - Sakshi

ఐర్లండ్లో ఉగాది వేడుకలు

తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఐర్లండ్లో ఉగాది సంబరాలు వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ గాయనీ గాయకులు సునీత, సింహా అక్కడకు వెళ్లి ఈ సంబరాల్లో తమ గాత్రమాధుర్యంతో ఐర్లండ్లోని తెలుగువారిని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకలు శనివారం 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి.

డబ్లిన్ లోని డీసీయూ క్యాంపస్లో గల హెలిక్స్ వేదిక వద్ద ఈ కార్యక్రమాలుంటాయి. ఇందులో పాల్గొనే ప్రేక్షకులకు కొన్ని బహుమతులు కూడా పెట్టారు. మొదటి బహుమతిగా ఐప్యాడ్ ఎయిర్, రెండో బహుమతిగా ఐప్యాడ్ మినీ, మూడో బహుమతిగా శాంసంగ్ ట్యాబ్4 ఇవ్వనున్నారు. వివరాలకు సత్యను 0858800272లో గానీ, మహేష్ను 0831118340లో గానీ సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement