పాపం చిన్నారి.. పోరాడి ఓడింది!
పాపం చిన్నారి.. పోరాడి ఓడింది!
Published Mon, Nov 21 2016 5:52 PM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM
అభం శుభం ఎరుగని చిన్నారి ఆమె. ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరించే ఆ పాప.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కేన్సర్ బారిన పడింది. బ్రిటన్‌లోని లాంక్‌షైర్ ప్రాంతానికి చెందిన జెస్సికా ఫొటోలను ఆమె తండ్రి ఆండ్రూ వీలన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ప్రాణాలతో ఉండాలని ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రార్థనలు చేసినా ఫలితం లేకపోయింది. చిన్నారి జెస్సికా మరణించిన విషయాన్ని ఆమె తండ్రి తెలిపారు.
జెస్సికా వీలన్‌కు అత్యంత అరుదైన 'న్యూరోబ్లాస్టోమా' అనే రకం కేన్సర్ వచ్చింది. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధి చంటి పిల్లల్లోను, ఐదారేళ్ల వయసు లోపు పిల్లల్లోను కనిపిస్తుంది. ఆమె చికిత్స పొందుతూ జుట్టంతా రాలిపోయినా కూడా ఆనందంగా నవ్వుతూనే ఉన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేయడంతో.. ఆ చిన్నారికి బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. జెస్సికా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఒకవైపు బాధగా ఉన్నా, మరోవైపు ఆమె మాత్రం బాధ నుంచి విముక్తి పొందినందుకు ప్రశాంతంగా ఉందని ఆమె తండ్రి బరువెక్కిన హృదయంతో పేర్కొన్నారు.
Advertisement