సియోల్: అత్యున్నతమైన దేశ వ్యవహారాల కమిషన్‌లోని సభ్యులను మారుస్తూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారని ఆ దేశ అధికారిక మీడియా సోమవారం తెలిపింది. మార్చిన అధికారుల సంఖ్య మూడో వంతుకన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశ వ్యవహారాల కమిషన్‌కు కిమ్ చైర్మన్‌గా ఉన్నారు. అందులో మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 5 మందిని దేశ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ (ఎస్పీఏ)లో ఆదివారం జరిగిన సమావేశంలో తొలగించి వేరేవారిని నియమించినట్లు ఆ దేశ మీడియా స్పష్టంచేసింది.
ఈ మార్పు చాలా పెద్దదేనని యూఎస్ ప్రభుత్వంలోని ఉత్తరకొరియా మాజీ ఎనలిస్టు రాచెల్ లీ అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన భేటీలో వందిలాది మంది అధికారులు ఒకే చోట చేరారు. అయితే వారెవరూ మాస్కులు ధరించకుండా కూర్చున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విస్తరణ లేదని ఈ చర్య స్పష్టం చేస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చారు. దేశ వ్యవహారాల కమిషన్‌కు ఎంపికైనవారిలో మాజీ సీనియర్ అధికారి సోన్ ద్వాన్ ఉన్నారు. కోవిడ్-19 కట్టడికి పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని కేబినెట్ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment