షేర్ చేసుకుందామా..
వీడో ప్రబుద్ధుడు.. అందుకే ఐఫోన్-6 కొనడం కోసం ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్‌నే షేర్ చేసుకుందాం అంటూ ఆఫరిచ్చేశాడు. చైనాలోని షాంగాయ్‌కు చెందిన ఈ విద్యార్థి(పేరు తెలియరాలేదు)కి ఐఫోన్ అంటే ఇష్టం. తాజాగా ఐఫోన్ 6 మార్కెట్లోకి వచ్చేసింది. కొనడానికేమో డబ్బుల్లేవు. దీంతో గర్ల్ ఫ్రెండ్ షేరింగ్ అంటూ సైన్ బోర్డు పట్టుకుని రోడ్డెక్కాడు. వచ్చే డబ్బులతో ఐఫోన్ 6 కొన్నాలన్నది వీడి ప్లాన్. ఇందులో భాగంగా తన స్నేహితురాలిని షేర్ చేసుకునేందుకు కొన్ని నిబంధనలూ పెట్టాడు. షేరింగ్‌కు ఒప్పుకునేవాళ్లు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి భోంచేయొ చ్చు. కలసి చదువుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు.
డేటింగ్‌కు వెళ్లొచ్చు. అయితే.. ‘ఎక్స్‌ట్రాలు’ చేయడానికి మాత్రం వీల్లేదని స్పష్టంగా చెప్పాడు. ఈ సేవలు పొందేందుకు గానూ.. గంటకు రూ.100.. నెలకైతే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆ విద్యార్థి చెప్పాడు. గతంలోనూ చైనాలో ఐఫోన్ కొనేందుకు పలువురు చిత్రవిచిత్ర పనులు చేశారు. ఐఫోన్, ఐప్యాడ్ కొనేందుకు ఓ యువకుడు తన కిడ్నీ అమ్మేస్తే.. 2011లో ఐఫోన్-4 కోసం ఓ యువతి తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది.