
లక్ష్యసాధనలో పురుషులే టాప్!
లక్ష్యసాధనలో మహిళల కంటే పురుషులే ఎక్కువ కష్టపడతారని బ్రిటన్‌కు చెందిన ‘యూనివర్సిటీ ఆఫ్ లీసేస్టర్’ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
లండన్: లక్ష్యసాధనలో మహిళల కంటే పురుషులే ఎక్కువ కష్టపడతారని బ్రిటన్‌కు చెందిన ‘యూనివర్సిటీ ఆఫ్ లీసేస్టర్’ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మహిళలు ఎలాంటి లక్ష్యాలు లేని సమయంలో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తారని, లక్ష్యం విధించుకుని పనిచేయాల్సి వస్తే మాత్రం పురుషులే నయమంటున్నారు. ఇందుకోసం పరిశోధకులు మూడుబృందాలను ఎంచుకున్నారు. వీరికి కొన్ని ప్రశ్నిలిచ్చి సమాధానాలు రాయమన్నారు.
మొదటి బృందానికి ఎలాంటి లక్ష్యాలు విధించలేదు. రెండో బృందానికి తక్కువ లక్ష్యాలు పెట్టారు. వీరు 10 సరైన సమాధానాలు రాశారు. పెద్ద లక్ష్యాలున్న మూడోబృందం సభ్యులు 15 సరైన సమాధానాలు రాశారు. మనిషి సాధారణ సమయంలో కంటే లక్ష్యం విధించుకుంటే ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయటమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు వివరించారు. రెండు, మూడు బృందాలకు తేడా పెద్దగా లేదు. మూడో బృందానికి సవాళ్లు అధికం కాబట్టి వారు మరింత సంకల్పం, అంకితభావంతో పనిచేశారు.