
ఎంత ఎదిగిపోయిందో..!
ఈ చిత్రం చూస్తుంటే పాలసముద్రంలో తేలియాడుతున్న కొండ అనిపిస్తోంది కదూ? పైన ఉన్నది కొండే.. కానీ కిందనున్నవి పాలు కాదు.. ట! ఔను.. నిజ్జంగా నిజం. ఏకంగా మేఘాలను సైతం దాటేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఈ పర్వతం పేరు మౌంట్ రోరైమా. దక్షిణ అమెరికాలోని పకరైమా పర్వత శ్రేణుల్లో ఉన్న అతి ఎత్తై కొండ ఇదే. అంతేకాదు.. ఈ భూమ్మీద సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత ప్రాచీనమైన భౌగోళిక నిర్మాణాల్లో ఇది కూడా ఒకటి. ఈ పర్వతం దాదాపు 200 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటుందని అంచనా.