బిష్కెక్ : షాంఘై సహకార సంస్ధ (ఎస్‌సీఓ) సమావేశాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. పుతిన్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అమేథిలో రైఫిల్ తయారీ యూనిట్‌కు రష్యా సహకారాన్ని కొనియాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు.
భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్‌ల ప్రారంభంతో పాటు మసూద్ అజర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. కాగా, ఎస్‌సీఓ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారని, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతమవుతోందని..వారు పలు ద్వైపాక్షిక అంశాలపై సంప్రదింపులు జరిపారని పీఎంఓ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment