టర్కీ పర్యటనకు నాటో చీఫ్ | NATO chief to visit Turkey amidst Iraq crisis | Sakshi
Sakshi News home page

టర్కీ పర్యటనకు నాటో చీఫ్

Published Mon, Jun 16 2014 9:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

NATO chief to visit Turkey amidst Iraq crisis

అంకారా: నాటో సెక్రటరీ జనరల్ ఆండర్స్ ఫోగ్ రొస్ముసెన్ టర్కీ పర్యటనకు వెళ్లనున్నారు. టర్కీ దేశస్తులను ఇరాక్లో బంధీలుగా ఉంచిన సంఘనటపై చర్చించనున్నారు. ఇలాంటి చర్యల వలన న్యాయం జరగదని, బంధీలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

టర్కీ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా గుల్, ప్రధాని రెసెప్ టయ్యిప్లతో నాటో చీఫ్ బేటీ కానున్నారు. ఇరాక్కు చెందిన తీవ్రవాదులు బుధవారం టర్కీ కాన్సులేట్పై దాడి చేసి 49 మందిని కిడ్నాప్ చేశారు. వీరిలో దౌత్యాధికారులు, సైనికులు, విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఓ పవర్ ప్లాంట్ నుంచి మరో 31 మంది టర్కీ దేశస్తులను కిడ్నాప్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement