
లండన్ : కరోనా వైరస్ విజృంభణతో ఇప్పటికే అతలాకుతలం అవుతున్న బ్రిటన్‌ని మరో కొత్త సమస్య కలవరపెడుతోంది. ఆ దేశంలో చిన్నారుల్లో అంతుపట్టిన అనారోగ్య సమస్యలను వెంటాడుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా దాదాపు ఒకే లక్షణాలున్న వందలాది మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. విపరీతమైన కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇవి కూడా కరోనా లక్షణాలంటూ కొంతమంది వైద్యులు భావిస్తున్నప్పటికీ.. వైరస్ బారినపడిన బాధితుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. (బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు)
చిన్నారుల్లో ‘టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, రక్త నాళాల్లో వాపు కనిపించే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం పిల్లలు అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపింది. అనుమానితులను వెంటనే గుర్తించి ఐసీయూల్లో ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆరోగ్య విభాగాన్ని ఆదేశించింది. ఇక బ్రిటన్‌లో నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,569కి చేరుకోగా.. 24 వేలకు పైగా బాధితులు మృత్యువాత పడ్డారు. (బ్రిటన్‌లో భారతీయుల మరణాలు ఎక్కువ..!)
Comments
Please login to add a commentAdd a comment