పోలీసు అధికారికి పదిహేనేళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: ఓ అమాయక వ్యక్తిపై కాల్పులు జరిపి అతడి మరణానికి కారణమైన అమెరికాకు చెందిన పోలీసు అధికారి కటకటాల పాలయ్యాడు. పదిహేనేళ్లపాటు ఆయనను జైలులో ఉంచనుంది. పీటర్ లియాంగ్ అనే పోలీసు అధికారి అకాయి గుర్లే (28) అనే నల్లజాతిపౌరుడిపై అకారణంగా కాల్పులు జరిపాడు.
దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనపట్ల నల్లజాతి పౌరులు ఈ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశించిన న్యూయార్క్ కోర్టు అతడు ఉద్దేశ పూర్వకంగా నేరం చేసినట్లు భావించి పదిహేనేళ్లపాటు జైలు శిక్షను విధించింది. ఈ తీర్పుపట్ల గుర్లే తరుపు వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు.