ఫేస్‌బుక్‌లో జెసిండా ఆర్డెర్న్ పోస్ట్ చేసిన చిత్రం
ఆక్లాండ్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కివీస్ కాలమాన ప్రకారం గురువారం సాయంత్రం 4గం.45ని. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆర్డెర్న్ తన ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ‘ఈ రోజు ఆక్లాండ్ సిటీ హాస్పటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చాం. చాలా సంతోషంగా ఉంది, 3.31 కేజీలతో శిశువు జన్మించింది. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు’ అంటూ భర్త క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి దిగిన ఫోటోను ఆర్డెర్న్ పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా జెసిండా ఆర్డెర్న్ పదవీ బాధ్యతలు చేపట్టారు. జనవరి నుంచి ఆమె ప్రసూతి సెలవులు తీసుకున్నారు. దీంతో ఉప ప్రధాని విన్‌స్టన్ పీటర్స్ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ప్రధాన మంత్రి పదవిలో ఉండగానే బెనజీర్ భుట్టో(పాకిస్థాన్) బిడ్డకు జన్మనివ్వగా, ఇప్పుడు అర్డెర్న్ భుట్టో సరసన నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment