
మన ఆర్థిక మంత్రులు ఏడాదికో కొత్త బడ్జెట్ బ్యాగ్‌ను పట్టుకుని పోజిస్తున్నారు గానీ.. బ్రిటన్‌లో 130 ఏళ్లకు పైగా.. ఒకే బడ్జెట్ బాక్స్‌ను వాడారు. ఆ సంగతి మీకు తెలుసా? ఆ బాక్సే ఇది. దీని పేరు గ్లాడ్‌స్టోన్ రెడ్ బాక్స్. 1860ల్లో అప్పటి బ్రిటన్ ఆర్థిక మంత్రి విలియమ్ ఎడ్వర్డ్ గ్లాడ్‌స్టోన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కోసం దీన్ని తొలిసారిగా వాడారు. అప్పట్నుంచి.. దాదాపు వందేళ్ల పాటు పెచ్చులూడిపోతున్నా.. చిరిగిపోతున్నా.. ప్రతి ఆర్థిక మంత్రి ఈ బాక్స్‌నే వాడారు.
1964–67 మధ్య అప్పటి ఆర్థిక మంత్రి జేమ్స్ కలాగన్ దీన్ని కాకుండా కొత్త బ్యాగును వాడారు. తర్వాత మళ్లీ షరా మామూలే. మరో 30 ఏళ్లు దీనిదే హవా. 1997లో గోర్డాన్‌బ్రౌన్.. 2007 వరకూ అంటే దశాబ్దం పాటు కొత్త బ్యాగులను ఉపయోగించారు. తర్వాత మళ్లీ 2010 జూన్ వరకూ దీన్నే వాడారు. ఇక వాడితే బాక్స్ బద్దలయ్యే ప్రమాదముందని గ్రహించారో ఏమో.. దీనికి రిటైర్‌మెంట్ ప్రకటించి.. కేబినెట్ వార్‌రూమ్‌లో దాచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment