ఐఓసీ కి ఎన్నికైన మొదటి మహిళగా 'నీతా' రికార్డ్..! | Nita Ambani first Indian woman member of IOC | Sakshi
Sakshi News home page

ఐఓసీ కి ఎన్నికైన మొదటి మహిళగా 'నీతా' రికార్డ్..!

Published Thu, Aug 4 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

ఐఓసీ కి ఎన్నికైన మొదటి మహిళగా 'నీతా' రికార్డ్..!

ఐఓసీ కి ఎన్నికైన మొదటి మహిళగా 'నీతా' రికార్డ్..!

అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య.. నీతా అంబానీ ఎన్నికయ్యారు. ఐఓసీకి ఎన్నికైన మొదటి భారతీయ మహిళగా నీతా రికార్డు సృష్టించారు. నీతా అంబానీని ఐఓసీ సభ్యురాలిగా ఎగ్జిక్యూటివ్ బోర్డు జూన్ నెలలో నామినేట్ చేయగా... గురువారం జరిగిన వరల్డ్ బాడీ 129వ సమావేశంలో ఆమె ఐఓసీ మొదటి మహిళా సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఒలింపిక్ అజెండా 2020 సిఫార్స్ ల ఆధారంగా జరిగిన ఐఓసీ సభ్యుల నియామకంలో నీతా ను ఎంపికచేశారు. ఐఓసీ సభ్యురాలిగా ఎంపికవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇదెంతో గర్వకారణమని నీతా అన్నారు. ఈ సందర్భంలో ప్రపంచంలో భారత్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, భారత మహిళలకు ఇచ్చే గుర్తింపు తెలుస్తోందన్నారు. ఒలింపిక్స్ ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా తెలియజెప్పేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement