చావుల నుంచి బయటపడ్డ న్యూయార్క్! | no deaths reported from newyork for the first time | Sakshi
Sakshi News home page

చావుల నుంచి బయటపడ్డ న్యూయార్క్!

Published Mon, Jul 13 2020 2:58 PM | Last Updated on Mon, Jul 13 2020 4:07 PM

no deaths reported from newyork for the first time - Sakshi

న్యూయార్క్: కొద్దిరోజుల క్రితం అమెరికాలో కోవిడ్​–19​కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్​ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నాలుగు నెలల తర్వాత న్యూయార్క్​లో ఆదివారం కరోనా కారణంగా  ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ విషయాన్ని న్యూయార్క్​ నగర డిపార్ట్​మెంట్​ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్​ హైజీన్​ ఓ ప్రకటనలో వెల్లడించింది. (ప్రియాంక చొరవతో దిగివచ్చిన సచిన్‌ పైలట్)

మార్చి 11న న్యూయార్క్​లో కరోనా తొలి మరణం సంభవించింది. ఏప్రిల్​ 7 నాటికి పరిస్థితి తీవ్రంగా మారింది. ఆ రోజు కోవిడ్​ లక్షణాలతో 597 మంది చనిపోగా, ఎలాంటి లక్షణాలు లేకుండా 216 మంది ప్రాణాలు విడిచారు. ఏప్రిల్​ 9న అత్యధికంగా 799 మంది చనిపోయారు. (కరోనాతో చెలగాటమాడాడు, ప్రాణాలు పొగొట్టుకున్నాడు)

ఇప్పటిదాకా ఈ విశ్వనగరంలో 18,670 పాజిటివ్​ కేసులు నమోదు కాగా వీరిలో 4,613 మంది మృతి చెందారు. కాగా, న్యూయార్క్​ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు 1.3 శాతంగా ఉంది. పోయిన శనివారం 341 మంది మహమ్మారి బారిన పడ్డారు.

నగరంలో దుకాణాలు ఇప్పుడిప్పుడే తెరుస్తున్నారు. టెక్సస్​, ఫ్లారిడా రాష్ట్రాల్లో బార్లు, రెస్టారెంట్లు తెరిచిన తర్వాత పాజిటివ్​ కేసులు పెరిగిపోయాయి. ఫలితంగా న్యూయార్క్​ నగర పాలకులు వీటిని తెరవడం అనే ఊసు కూడా ఎత్తడం లేదు.

మరోవైపు వాషింగ్టన్​లో కూడా కరోనా పాజిటివ్​ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన మూడు రోజుల్లో అక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అమెరికా మొత్తం మీద కోవిడ్​–19 వల్ల 1,34,904 మంది చనిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement