సియోల్/వాషింగ్టన్ : ఉత్తరకొరియా బుధవారం మరోసారి ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ని పరీక్షించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా గుర్తించినందుకే ఈ క్షిపణిని పరీక్షించినట్లు కిమ్ దేశం ప్రకటించింది.
దాదాపు 1000 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో పడినట్లు పెంటగాన్ పేర్కొంది. ఈ పరీక్షతో ఉత్తరకొరియా అమెరికాలోని ఏ భూభాగాన్నైనా ఢీ కొట్టగల సామర్ధ్యాన్ని సాధించినట్లు
రక్షణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. అమెరికాతో పాటు, యూరప్, ఆస్ట్రేలియాల్లోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్ధ్యం ఉత్తరకొరియా సాధించింది.
కాగా, ఉత్తరకొరియా తాజా పరీక్షపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ రక్షణను తాము చూసుకుంటామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ ఉత్తరకొరియా క్షిపణిపరీక్షపై అత్యవసరంగా భేటీ కానుంది. ఉత్తరకొరియా పరీక్షను జపాన్, దక్షిణ కొరియాల అధ్యక్షులు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment