హవ్వ! స్వయంవరం ఇలానా!! | North Korea's Kim Jong-Un turns into a matchmaker for his sister, set to host dating contest | Sakshi
Sakshi News home page

హవ్వ! స్వయంవరం ఇలానా!!

Published Thu, May 26 2016 6:34 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

హవ్వ! స్వయంవరం ఇలానా!! - Sakshi

హవ్వ! స్వయంవరం ఇలానా!!

లండన్: ఎప్పుడూ ప్రపంచదేశాలకు తన దూకుడుతో కంగారు పుట్టించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ తన చెల్లెలు కిమ్ యో జోంగ్ వివాహానికి స్వయంవరాన్ని ప్రకటించాడు. అయితే అందుకు ఓ విచిత్రమైన షరతు పెట్టాడు. జోంగ్ ని వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి ఆమెను అతనితో డేటింగ్‌కు ఒప్పించాలి.

మరి ఎంతమంది అబ్బాయిలకు ఈ పోటీలో చాన్స్ ఉంటుందని అనుకుంటున్నారా ? కేవలం 30 మంది.. అది కూడా ఉన్ ఎంపిక చేసిన తర్వాతే స్వయంవరానికి అర్హుడవుతాడు. వరుడి ఎంపిక కోసం ఉన్ ఏకంగా ఒక మార్గాన్ని కనిపెట్టేశాడు. వరుడు కచ్చితంగా బ్రహ్మచారి అయి ఉండాలి. దేశ రాజధాని ప్యూయాంగ్ లోని కిమ్-2 సంగ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీని పొంది ఉండాలి. 5 అడుగుల 10 అంగుళాల కనీస ఎత్తు, ఉత్తర కొరియా ఆర్మీలో పనిచేసి ఉండాలి.

కానీ ఈ వార్తలు నిజం కావని ఓ కొరియా పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. యో జోంగ్ కు కొరియా పార్టీకి చెందిన ప్రముఖ నేతతో వివాహం జరిపించారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement