యూఎస్ అటార్నీ జనరల్గా లొరెట్టా లించ్ | Obama to nominate Loretta Lynch as new Attorney General | Sakshi
Sakshi News home page

యూఎస్ అటార్నీ జనరల్గా లొరెట్టా లించ్

Published Sat, Nov 8 2014 11:32 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

యూఎస్ అటార్నీ జనరల్గా లొరెట్టా లించ్ - Sakshi

యూఎస్ అటార్నీ జనరల్గా లొరెట్టా లించ్

వాషింగ్టన్: యూఎస్ నూతన అటార్నీ జనరల్గా లొరెట్టా లించ్ను దేశాధ్యక్షడు ఒబామా ఎంపిక చేశారు. ఈ మేరకు వైట్హోస్ శనివారం వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన ఎరిక్ హోల్డర్ పదవి కాలం ముగియడంతో లొరెట్టాను ఈ పదవిలో ఒబామా నియమించారని వైట్హౌస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. అయితే లొరెట్టా నియామకాన్ని సెనెట్ ఆమోదించవలసి ఉంది వెల్లడించారు.

దేశంలో అత్యున్నత పదవుల్లో ఒకటైన ఈ పదవి కోసం ఎందరో హేమాహేమీలు పోటిపడ్డారని ... కానీ ఆ పదవి మాత్రం లొరెట్టాను చెప్పారు. దేశంలోని అటార్నీ జనరల్ కార్యాలయంలో లొరెట్టా ఇప్పటికే రెండు సార్లు కీలక బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ న్యూయార్క్ జిల్లాలోని యూఎస్ అటార్నీ కార్యాలయంలో పని చేస్తున్నారని ఎర్నెస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement