
ఈ ఫొటోలో కనిపిస్తున్న రెండు ఎగ్స్‌ను చూస్తే మీకేమనిపిస్తోంది? వెంటనే ఆమ్లెట్ వేసుకుని లాగించేయాలని నోరూరుతోంది కదూ? అయితే వాటిలో ఒకటి మాత్రమే రియల్ ఎగ్! నమ్మరు కదా? అందులో ఒకటి పేయింటింగ్. అయితే ఏది రియల్ ఎగ్గో గుర్తు పట్టండి చూద్దాం.. ఈ ఫొటోను జపాన్ పెయింటర్ యాస్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసి ‘గుర్తుపట్టండి చూద్దాం’అని పోస్టు చేశాడు. అయితే చాలా మంది రియల్ ఎగ్‌ను గుర్తు పట్టలేకపోయారు. దీన్ని హైపర్ రియలిస్టిక్ పెయింటింగ్ అంటారు.
పండ్లు, కూరగాయల క్రాస్ సెక్షన్ ఫొటోలను సైతం నిజమైనదేదో గుర్తు పట్టలేనంతగా యాస్ గీస్తాడు. తాను గీసిన హైపర్‌రియలిస్టిక్ పెయింటింగ్స్‌లో ఇదే అత్యుత్తమమైనదని యాస్ చెప్పారు. దీనికి ట్విట్టర్‌లో 63 వేల లైక్‌లు వచ్చాయి. ఈ పెయింటింగ్స్‌కి కొన్ని గంటల సమయం వెచ్చిస్తానని, కొన్ని సార్లు వీటికి రోజులు కూడా పడుతుందన్నారు. అయితే ఫ్యాన్స్ నుంచి వచ్చే స్పందన తన కష్టం మరిచిపోయేలా చేస్తుందని యాస్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏది నిజమైన ఎగ్గో గుర్తుపట్టారా? కుడివైపు ఉన్నది రియల్ ఎగ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే!
Comments
Please login to add a commentAdd a comment