
మమ్నూన్ హుస్సేన్ (ఫైల్ ఫోటో)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. జూలై 25న దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ రాసిన లేఖకు అధ్యక్షుడు స్పందించారు. జూలై 25న ఎన్నికల నిర్వహణకు ఆయన అనుమతినిచ్చారు. ఆ దేశ నియమావళి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే దేశ అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వ పదవీ గడువు మే 31తో ముగియనుండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా 105 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.