- ఒబామా గ్రీన్‌సిగ్నల్
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా బిలియన్ డాలర్ల(రూ.6,200 కోట్లు) నిధులను అందించనుంది. అఫ్ఘానిస్థాన్‌లో తన సైనిక కార్యకలాపాలకు సహకారంగా పాక్ ఆర్మీ చేసిన ఖర్చులను అమెరికా తిరిగి చెల్లించనుంది. ఈ మేరకు డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2015పై దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం సంతకం చేశారు. అయితే, ఉగ్రవాద కార్యకలాపాల మీద చర్యలు తీసుకోవాలని, హుక్కానీ నెట్‌వర్క్‌పై చర్యలు ఉండాలని అమెరికా ఎప్పటి మాదిరిగానే నిబంధనలు విధించింది.