
ఆ ఎంజైమ్ లోపంతోనే తాగుడు!
లండన్: ఓ ఎంజైమ్ లోపం వల్ల తాగుడు (ఆల్కహాల్)కు బానిసలు అవుతారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు ముందు భాగంలోని నాడీ కణాల్లో పీఆర్‌డీఎం2 ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల తాగుడుకు బానిస అవుతారని గుర్తించారు. కేన్సర్‌కు సంబంధించి ఇది ఎలాంటి పాత్ర పోషించడం లేదని తేలిందని స్వీడన్‌లోని లింకోపింగ్ యూనివర్సిటీకి చెందిన మార్కస్ హీలిగ్ తెలిపారు. ఆల్కహాల్‌కు, మెదడుకు సంబంధంపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నా యూనివర్సిటీ ఆఫ్ మియామి, లింకోపింగ్ యూనివర్సిటీ పరిశోధకులు తొలిసారిగా దీన్ని ఛేదించింది.