లడ్డుబాబులకు ప్రొటీన్‌తో చెక్! | Protein code found in the Indian-origin scientist | Sakshi
Sakshi News home page

లడ్డుబాబులకు ప్రొటీన్‌తో చెక్!

Published Sat, Jun 14 2014 12:24 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

లడ్డుబాబులకు ప్రొటీన్‌తో చెక్! - Sakshi

లడ్డుబాబులకు ప్రొటీన్‌తో చెక్!

ప్రొటీన్ కోడ్‌ను కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్త
 
లండన్: ఊబకాయం.. శాపం కాదు.. పాపమూ కాదు. కానీ నలుగురి మధ్యలో స్వేచ్ఛగా తిరగడానికిఏదో ఇబ్బంది! ఇలా లడ్డుబాబులు/పాపల బాధలు చెప్పాలంటే ఒక్కటి కాదు. కానీ త్వరలోనే ఈ బాధలన్నిటికీ చెక్ పెట్టే మాత్ర తీసుకురావడానికి భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త భరత్ షింపుకదే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీకి చెందిన ఈయన ఇటీవలే సంబంధిత ప్రొటీన్ కోడ్ గుట్టును కనుగొన్నారు. ఎఫ్‌ఎఫ్‌ఏ4గా పిలిచే ఈ ప్రొటీను.. పేగుల్లోని కణత్వచాలు, రోగ నిరోధక కణాలు, కొవ్వులలో ఉంటుంది. ఆహారం నుంచి విడుదలయ్యే ఒమెగా 3 లాంటి కొవ్వు ఆమ్లాల ద్వారా ఇది క్రియాశీలమవుతుంది. అలా జరిగినపుడు అది మన ఆకలిని నియంత్రించి, రక్తంలోని చక్కెర వినియోగాన్ని పెంచే హార్మోన్లను విడుదల చేస్తుంది.

అయితే ‘‘కొంత మందిలో ఈ ప్రొటీన్ విడుదల కాకపోవడం వల్ల వారు ఊబకాయం బారిన పడే ప్రమాదముంది’’ అని భరత్ షింపుకదే చెప్పారు. అలాంటి వారిలో ఈ ప్రొటీన్‌ను క్రియాశీలం చేయడానికి ఓ మార్గాన్ని కనుగొనటానికి యత్నిస్తున్నామని, తద్వారా ఊబకాయానికి చెక్ పెట్టే మాత్రలను రూపొం దించాలనుకుంటున్నామని చెప్పారు. పలు అణువులు ఈ ప్రొటీన్‌ను క్రియాశీలం చేయగలవని, చేయాల్సిందల్లా తగిన అణువును కనుక్కోవడమేనన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement